21 June, 2026 | 1:41 PM

ఖానాపూర్ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

19-06-2026 12:36 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జంగిలి శంకర్, పట్టణ అధ్యక్షులు గొర్రె గంగాధర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గొర్రె గంగాధర్ మాట్లాడుతూ భారతదేశానికి భవిష్యత్తు ప్రధాని రాహుల్ గాంధీ గారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు రాజుర సత్యం, అధికార ప్రతినిధి దొనికేనే దయానంద్, కార్యవర్గ సభ్యులు జన్నారపు శంకర్, ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, మున్సిపల్ కౌన్సిలర్లు నిమ్మల రమేష్, సర్పంచులు రాజు నాయక్ ,పోలంపల్లి సచిన్, నాయకులు నేరెళ్ల సత్యనారాయణ, మధిర సత్యనారాయణ ,అమానుల్లా ఖాన్, రాజేందర్ ,రవి,  శామ్, శ్రీనివాస్, మేదరి రాజేశ్వర్,  రమేష్, శ్రీహరి, సురేష్, రాజేశ్వర్, రాజేందర్, జహీర్, తదితరులు ఉన్నారు.