21 June, 2026 | 1:57 PM

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రసమయి

19-06-2026 12:27 PM

బెజ్జంకి, జూన్ 19(విజయక్రంతి): బెజ్జంకి మండలంలోని రాంసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని బెజ్జంకి ఎక్స్ రోడ్, తోటపల్లి, లక్ష్మీపూర్ గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ శుక్రవారం పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ధైర్యం చెప్పారు. కష్టకాలంలో బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు పాకాల మైపాల్ రెడ్డి,లింగాల లక్ష్మణ్, తిరుపతి, శేఖర్ బాబు, శ్రీనివాస్ రావు, దేవయ్య, కవ్వంపెల్లి శ్రీనివాస్, బాబు, అనిల్, రాజిరెడ్డి, అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అర్జున్, శంకర్, ఎస్.రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.