12 March, 2026 | 3:25 AM

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

07-02-2026 12:00 AM

అశ్వాపురం, ఫిబ్రవరి 6 (విజయ క్రాంతి):  గురువారం రాత్రి భద్రాచలం నుండి మణుగూరుకు పల్సర్ బ్పై వెళ్తున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ,గురువారం రాత్రి సుమారు 8:10 గంటల సమయంలో భద్రాచలం నుండి మణుగూరుకు వెళ్తున్న తోకల శంకర్ (27), తండ్రి శ్రీనివాస్, వృత్తి కార్పెంటర్, నివాసం కుంకుడు చెట్ల గుంపు, మణుగూరు.

అశ్వాపురం మండలం ,మల్లెల మడుగు సమీపంలోని మూల మలుపు వద్ద ప్రమాదవశాత్తు రక్త గాయాలతో పడివుండగా స్థానికులు గుర్తించి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి సుమారు 11:20 గంటల సమయంలో శంకర్ మృతి చెందాడు.

మృతుడు సారపాకకు చెందిన ఒక మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని, ఆ మహిళ భర్త అనుచరులు కలిసి తన కుమారుడిని కొట్టి హత్య చేశారని మృతుడి తల్లి తోకల వెంకటరమణ ఫిర్యాదు చేయగా, ఆ ఫిర్యాదు మేరకు అశ్వాపురం ఎస్‌ఐ రాజేష్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.