1 August, 2026 | 11:00 PM

ఓటు వేసేందుకు వెళ్తూ అనంత లోకాలకు

28-05-2024 12:43 AM

ఇల్లెందు, మే 27:  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం లాలుతండాలో చోటుచేసుకున్నది. తెలిసిన వివరాల ప్రకారం.. ఇదే మండలం సంపత్‌నగర్‌కు చెందిన పాయం కృష్ణ (48), జానకి (38) దంపతులు. పాయం కృష్ణ పాల్వంచలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ అక్కడే భార్య, కుమార్తెతో కలిసి నివసిస్తున్నాడు. వీరు సోమవారం టేకులపల్లి పోలింగ్  కేంద్రంలో ఓటు వేసేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. వాహనం లాలూతండా మూలమలుపు వద్దకు రాగానే కారు ఢీకొట్టింది. ఘటనలో తీవ్రగాయాల పాలైన దంపతులను తోటి ప్రయాణికులు ఆటోలో కొత్తగూడెంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దంపతులిద్దరూ మృతిచెందారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.