11-12-2025 12:18:33 PM
రాజన్నసిరిసిల్ల,(విజయక్రాంతి): తెలంగాణ పంచాయతీ ఎన్నికల(Telangana Panchayat Elections) తొలి విడత పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. వేములవాడ నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి లైన్లో నిల్చోని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్(Aadi Srinivas) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రజలు తప్పకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఇప్పటికే పట్టణాలు, నగరాల్లో పనిచేస్తున్న చాలా మంది ఓటర్లు తమ ఓటు వేయడానికి తమ స్వగ్రామాలకు తిరిగి వచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.