calender_icon.png 11 December, 2025 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా పోలింగ్

11-12-2025 12:46:30 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని(Mancherial district) హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో గురువారం జరుగుతున్న మెదటి విడుత పంచాయితీ ఎన్నికలు(Gram Panchayat first phase polling) ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. నాలుగు మండలాల్లో 1,24,019 మంది ఓటర్లుండగా చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైనా ఓటు వేసేందుకు ఓటర్లు నెమ్మదిగా రావడంతో ఉదయం తొమ్మిది గంటల వరకు కేవలం 20,576 (16.59 శాతం) ఓట్లు పోలయ్యాయి. తొమ్మిది గంటల తర్వాత ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలిరావడంతో ఉదయం 11 గంటల వరకు 60,606 (48.87 శాతం) ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకే పోలింగ్ కు సమయం ఉండగా అభ్యర్థులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు పోటీపడుతున్నారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చేందుకు ఆటోలను ఉపయోగిస్తున్నారు. సుదూర ప్రాంతాల్లోని ఓటర్లను తీసుకువచ్చేందుకు వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు కార్లను సైతం సమకూర్చి తీసుకువస్తున్నారు. జిల్లాలో పోలింగ్ ఇలా సాగుతుంది...

మండలం    మొత్తం ఓటర్లు    9 గంటల వరకు పోలైన ఓట్లు              11 గంటల వరకు పోలైన ఓట్లు

=====================================================================

దండేపల్లి           38,532                       5,548 (14.40 శాతం)                           17,845 (46.31 శాతం) 

హాజీపూర్            16,954                       3,176 (18.73 శాతం)                             9,167 (54.07 శాతం) 

జన్నారం            43,306                       6,058 (13.99 శాతం)                           19,568 (45.19 శాతం) 

లక్షెట్టిపేట          25,227                       5,794 (22.97 శాతం)                           14,026 (55.60 శాతం) 

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌=====================================================================

మొత్తం  :           1,21,656                     20,576 (16.59 శాతం)                           60,606 (48.87 శాతం)   

=====================================================================