జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ గా అభిలాష అభినవ్ బదిలీ
15-06-2024 08:25 PM
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేటర్ (జీహెచ్‌ఎంసీ) కూకట్ పల్లి జోనల్ కమిషనర్ పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న అభిలాష అభినవ్ బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం జారీ చేసిన ఐఏఎస్ బదిలీలో 2018 బ్యాచ్‌కు చెందిన అభిలాష అభినవ్‌ను నిర్మల్ కలెక్టర్‌గా బదిలీ చేసింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సెలవులో వెళ్లడంతో హెచ్‌ఎండిఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలి జీహెచ్‌ఎంసీ ఇంచార్జ్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూకట్ పల్లి జోనల్ కమిషనర్‌గా ఎవరు నియామకం కానున్నారో చూడాలి మరీ. ప్రస్తుతం ఆదివారం, సోమవారం బక్రీదు వరుస సెలవులు ఉన్నందున మంగళవారం రిలీవ్ అయ్యే అవకాశం ఉంది.






