18 August, 2026 | 11:28 PM

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి నిర్ణయం

15-06-2024 07:21 PM

హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. వైద్య ఆరోగ్యశాఖలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ద్వారా 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీ చేయాలనుకున్నట్లు సమాచారం. 193 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 31 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ఎంహెచ్ఎస్ఆర్బీ త్వరలో నోటీఫికెషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.