18 August, 2026 | 9:36 PM

జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి పథకానికి రూ.15 కోట్లు విడుదల

15-06-2024 08:54 PM

హైదరాబాద్: ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయంలో విదేశాల్లో చదవడం ప్రతి విద్యార్థి కల. అయితే వెనుకబడిన తరగతులకు చెందిన పేద విద్యార్థులకు విదేశాల్లో చదువుకోవడానికి ఆర్థిక సహాయం అందించే  జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి పథకానికి తెలంగాణ ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసింది. బడ్జెట్ కేటాయింపుల్లో మొదటి త్రైమాసిక నిధులు మంజూరుకు ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ ఉపకార వేతనాలకు రూ.387.51 కోట్లు తొలి త్రైమాసిక నిధులు మంజూరు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.