7 May, 2026 | 4:11 AM

జేఈఈ ఫలితాల్లో గురుకుల విద్యార్థుల సత్తా

26-04-2024 02:02 AM

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్ సెషన్ ఫలితాల్లో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. బీసీ గురుకుల విద్యార్థి కే శ్రీనివాస్ 97.51 పర్సంటైల్ సాధించగా, ఈ వైష్ణవి అనే అమ్మాయి 96.78 పర్సంటైల్ సాధించారు. ఎనిమిది మంది అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు 90కి పైగా పర్సంటైల్ సాధించారు. అబ్బాయిల్లో 44, అమ్మాయిల్లో 28 మంది జేఈఈ మెయిన్ సెషన్‌లో అర్హత సాధించారు. విద్యార్థులను బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ గురుకుల సెక్రటరీ బి.సైదులు అభినందించారు. 

మైనార్టీ గురుకులాల్లోనూ...

జేఈఈ మెయిన్ ఫలితాల్లో మైనా ర్టీ గురుకులానికి చెందిన విద్యార్థు లూ విజయకేతనం ఎగురవేశారు. మొత్తం 30 మంది పరీక్షలకు హాజరుకాగా 22 మంది అర్హత సాధిం చారు. సుఫియాన్ మొహియుద్దీన్ 99.05 పర్సంటైల్ మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 11,119 ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 2,251 ర్యాంక్ సాధించారని మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిటూషన్స్ సొసైటీ కార్యదర్శి ఐషామనరత్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.