7 May, 2026 | 5:03 AM

కరీంనగర్ మహిళా డిగ్రీ కాలేజీకి అటానమస్ హోదా

26-04-2024 02:00 AM

l ఎంపీ బండి సంజయ్ లేఖకు స్పందించిన కేంద్రం

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు కేంద్రం అటానమస్ హోదాను కల్పించింది. మహిళా డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా కల్పించాలంటూ ఫిబ్రవరి 16న కేంద్రానికి ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు లేఖ రాసింది. ఈ సందర్భంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.