3 July, 2026 | 10:40 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

ఈఏపీసెట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థుల సత్తా

12-06-2024 12:26 AM

ఇంజినీరింగ్ టాప్ 10 ర్యాంకుల్లో ఇద్దరు మనోళ్లే

అగ్రికల్చర్ విభాగంలో ఫస్ట్, 7వ ర్యాంకులు తెలంగాణకే

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో 2024 విద్యాసంవత్సరం కోసం నిర్వహించిన ఈఏపీసెట్ ఫలితాలను ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జే శ్యామలరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కే రామమోహన్ రావు మంగళవారం విడుదల చేశారు.

ఈ  పరీక్షలకు 3.62 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 3.39 లక్షల మందికిపైగా పరీక్ష రాశారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 1,95,092 (75.51శాతం), అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 70,352 (87.11 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. రెండు విభాగాల్లోనూ టాప్ 10 ర్యాంకుల్లో మనోళ్లు ఇద్దరు చొప్పున ఉన్నారు. ఇంజినీరింగ్‌లో సిద్ధిపేట జిల్లాకు చెందిన యప్పా లక్ష్మీనరసింహారెడ్డి 6వ ర్యాంకు, హనుమకొండ జిల్లాకు చెందిన పరమరాధ్యుల సుశాంత్ 9వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. అగ్రికల్చర్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన ఎల్లు శ్రీశాంత్ రెడ్డి మొదటి ర్యాంకులో నిలవగా,  పెన్నమాడ నిహారిక రెడ్డి 7వ ర్యాంకు సాధించారు.

ఇంజినీరింగ్‌లో టాప్ 10 ర్యాంకర్లు

1. మాకినేని జిష్ణుసాయి (గుంటూరు జిల్లా)

౨. మురసాని సాయియశ్వంత్‌రెడ్డి (కర్నూలు)

౩. గోగాలపల్లి సందేశ్ (ఆదోని)

౪. పీ సతీష్ రెడ్డి (అనంతపురం)

౫. కోమటినేని మనీష్‌చౌదరి (గుంటూరు)

౬. యప్పా లక్ష్మీనరసింహారెడ్డి (సిద్ధిపేట

౭. గొల్ల లేఖాహర్ష (కర్నూ లు)

౮. పుట్టి కుశాల్ కుమార్ (అనంతపురం)

౯. పరమరాధ్యుల సుశాంత్ (హనుమకొండ

1౦. కోమిరిశెట్టి ప్రభాస్      (ప్రకాశం)

అగ్రికల్చర్ విభాగంలో టాప్ 10 ర్యాంకర్లు

1. ఎల్లు శ్రీశాంత్ రెడ్డి (హైదరాబాద్

౨. పూల దివ్యతేజ (తలుపుల జిల్లా)

౩. వడ్లపూడి ముఖేష్ చౌదరి (తిరుపతి)

౪. పేరా సాత్విక్ (చిత్తూరు)

౫. ఆలూరు ప్రణీత (మదనపల్లె

౬. గట్టు భానుతేజసాయి (అనంతపురం)

౭. పెన్నమాడ  నిహారిక రెడ్డి  (హైదరాబాద్

౮. శంబంగి మనోఅభిరామ్ (విశాఖ)

౯. శరగడం పావని (విశాఖ)

1౦. నాగుదాసరి రాధాకృష్ణ  (పార్వతీపురం