7 August, 2026 | 6:53 AM

సిపిఎస్ రద్దుచేసి ఓపీఎస్‌ను అమలు చేయండి

23-08-2024 12:34 PM

ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ముందు తమ ఆవేదనను వెలిబుచ్చిన పీజీసిపిఎస్ సంఘం నేతలు..

మహబూబ్ నగర్: ఉద్యోగుల చిరకాల కోరికగా మిగిలిన సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ ను అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విన్నవిస్తూ ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సనాతన బాల స్వామి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే  శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2004 లో నాటి ప్రభుత్వం ఇచ్చిన జిఓ నెంబర్ 28 ద్వారా నూతనంగా ఎంపికైన ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ సౌకర్యం కోల్పోయారని, అందుకే గతంలో ప్రభుత్వం ఇచ్చిన జిఓ ను రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు ఎంతో కలత చెందుతున్నారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి మీ సమస్య తీసుకువెళ్లి న్యాయం చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు స్థిత ప్రజ్ఞ, శ్రీకాంత్, నరేష్ గౌడ్, జిల్లా నాయకులు సనాతన బాలస్వామి, చంద్రకాంత్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.