7 August, 2026 | 7:50 AM

డిసిసిబి చైర్మన్‌గా మామిళ్ల విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

23-08-2024 12:27 PM

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ డిసిసిబి చైర్మన్ ఎన్నిక అందరూ ఊహించినట్లుగానే ఏకగ్రీవం అయింది. మామిళ్ల విష్ణువర్ధన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల నిర్వహణ అధికారి టైటాస్ పాల్ సమక్షంలో జిల్లా కేంద్రంలోని డిసిసిబి కార్యాలయంలోని సమావేశ మందిరం నందు ఏకగ్రీవంగా మామిళ్ల విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నుకోవడంతో ఎన్నికల నిర్వహణ అధికారి టైటాస్ పాల్ నియామక పత్రాన్ని అందజేశారు. నూతన చైర్మన్ గా  వనపర్తి జిల్లాకు చెందిన మామిళ్ళ  విష్ణువర్ధన్ రెడ్డి  ఏకగ్రీవంగా ఎన్నిక కావడం తో చైర్మన్ కు ఎన్నికల నిర్వహణ అధికారి టైటస్ పాల్ నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, మేఘా రెడ్డి, డాక్టర్ పర్నికా రెడ్డి, జియంఆర్, అనిరుధ్ రెడ్డి, మైనారిటీ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

ఫలించని బిఆర్ఎస్ వ్యూహం....

డిసిసిబి చైర్మన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ చైర్మన్ గిరిని దక్కించడంలో విఫలమైంది. చైర్మన్ గా బాధితుల నుంచి తప్పుకున్న నిజం పాషా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆయన రాజీనామా చేయడంతో ఎన్నిక ప్రక్రియ అనివార్యమైన విషయం విధితమే. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన డిసిసిబి చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో చైర్మన్ పదవిని కాంగ్రెస్ వశం చేసుకుంది. దీంతో టిఆర్ఎస్ పార్టీ కి దాదాపు 14 మంది సభ్యుల బలం ఉన్నప్పటికీ ఎన్నిక మాత్రం ఏకగ్రీవం కావడంతో టిఆర్ఎస్ పార్టీ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదని ఆరోపణలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే మహబూబ్నగర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవికి అవిశ్వాసం పెట్టి కాంగ్రెస్ వశం చేసుకుంది జడ్చర్ల సొంత పార్టీ నేతలు నుంచే వ్యతిరేకత ఏర్పడడంతో మరో టిఆర్ఎస్ నేత చైర్మన్ పదవి దక్కించుకున్నారు. టిఆర్ఎస్ పార్టీలో అంతర్లింగానే సయోధ్యకు వెళ్దాం లేదని ఆరోపణలు బందుకున్నాయి. క్రమంలోనే డిసిపి ఎన్నిక కూడా ఏకగ్రీవంతో కాంగ్రెస్ గూటికి చేరింది.