25 August, 2026 | 2:42 AM

మండల ప్రజావాణిలో అర్జీల స్వీకరణ

25-08-2026 01:41 AM

మహమ్మదాబాద్, (గండీడ్) ఆగస్టు 24 : మండల కేంద్రాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాలకు ప్రజల నుంచి అర్జీలు అందాయి. మహమ్మదాబాద్ మండల ప్రజావాణిలో మొత్తం మూడు అర్జీలు స్వీకరించినట్లు ఎంపీడీవో నరేందర్రెడ్డి, తహసీల్దార్ విద్యాసాగర్రెడ్డి, మండల అధికారులు తెలిపారు.

వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి రెండు, విద్యుత్ శాఖకు సంబంధించి ఒక అర్జీ ఉన్నట్లు పేర్కొన్నారు. గండీడ్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మాచారం శ్రీనివాస్రెడ్డి పాల్గొని కొమిరెడ్డిపల్లి గ్రామంలోని గ్రామకంఠం పరిధిలో ఉన్న సర్వే నంబర్ 298లోని భూమిని సర్వే చేయాలని అధికారులకు అర్జీ సమర్పించారు.

ఈ సందర్భంగా సమస్యను తహసీల్దార్ రాజ్గోపాల్, ఎంపీడీవో మంజుల, ఇతర మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ జంగళ్ల వెంకటయ్య, ఆంజనేయులు, రవికాంత్రెడ్డి, డి.శ్రీనివాస్రెడ్డి, ఎం.శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.