25 August, 2026 | 2:40 AM

ఘనంగా తొట్టెల వేడుకలు

25-08-2026 01:41 AM

నాగోల్, ఆగస్టు 24 (విజయక్రాంతి): కొత్తపేట బోనాల జాతరను పురస్కరించుకుని చైతన్యపురి డివిజన్లోని వివిధ కాలనీల్లో తొట్టెల కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మారుతీనగర్లో బొట్టు నిఖిల్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే సుధీర్రెడ్డితో కలిసి బీఆర్‌ఎస్ చైతన్యపురి డివిజన్ నాయకుడు చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తొట్టెలను సమర్పించారు. అనంతరం న్యూ ఇందిరానగర్లో సాయి ఆధ్వర్యంలో జరిగిన తొట్టెల కార్యక్రమంలోనూ చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు సంప్రదాయబద్ధంగా బోనాల వేడుకలు నిర్వహించారు.