ప్రతి గ్రామానికి పశువైద్యులను నియమించాలి
25-08-2026 01:43 AM
వీపనగండ్ల, ఆగస్టు 24 : మండలంలోని గ్రామాల్లో పశువులు, గొర్రెలు, మేకలు అనారోగ్యంతో మృతి చెందుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై రైతు ముంత శివయాదవ్ సోమవారం వనపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. గ్రామాలకు పశువైద్యులను నియమించి సకాలంలో వైద్యం, మందులు, టీకాలు అందించాలని కోరారు.






