25-11-2025 07:58:47 AM
హ్యూమన్ రైట్స్ పై విద్యార్ధులకు అవగాహన సదస్సు
మత్తు పదార్థాలు మాదకద్ర ద్రవ్యాలు వాడకండి
- డాక్టర్ విజయ మోహన్ రావు
చర్ల, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రం లో గల స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల లో విద్యార్థులకు డాక్టర్ విజయ్ మోహన్ రావు డిజిసిఇఒ మరియు చైర్మన్ ఆద్వర్యం లో సోమవారం హ్యూమన్ రైట్స్ పై ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్ధులకు అవగహాన సదస్సు ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే చక్కని ప్రవర్తన కలిగి క్రమశిక్షణతో మేలగాలని, తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించే విధం గా ఉండాలని అన్నారు, భారతదేశంలో మాదకద్రవ్యాల వాడకం నాటికి నేటికి విపరీతంగా పెరిగిందని విద్యార్థులు ఎక్కువగా మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని, పల్లె ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి మాదక ద్రవ్యాల (డ్రగ్స్) భారిన పడుతూ తల్లిదండ్రులను విస్మరిస్తున్నారని ప్రతి ఒక్కరూ విద్యతోపాటు వినయం బాల్యం నుంచే నేర్చుకోవాలని మత్తు పదార్థాలు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ,రాజ్యాంగంలోని హక్కులను తెలుసుకొని బాధ్యతయుతంగా ప్రవర్తించాలని ఈ సందర్భంగా విద్యార్థులకు హితబోధ చేశారు, ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానోపాధ్యాయులు నరేంద్ర, డా. దిలీప్ కుమార్ జవ్వాజీ జాతీయ ఎస్ టి హక్కుల చీఫ్,జిల్లా కోఆర్డినేటర్లు పెదపూడి కనక రాజు,జి. చిరంజీవ,మండల టీమ్ లీడర్లు,ముఖ్య సలహాదారు & ఉపాధ్యక్షుడు Dr. E యేసు జీవం,అధ్యక్షుడు కొట్ర బాబు రావు,కార్యదర్శి మిస్టర్ తన్నీరు కృష్ణ,జాయింట్ సెక్రటేరియట్, మిస్టర్ తెల్లం శ్రీనివాస రావు కోశాధికారి మేకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.