7 August, 2026 | 2:53 AM

పంతంగి టోల్ ప్లాజా వద్ద ప్రమాదం

07-08-2026 01:44 AM
  1. లారీని ఢీకొట్టిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కారు
  2. ఎమ్మెల్యే సురక్షితం

చౌటుప్పల్, ఆగస్టు 6 (విజయక్రాంతి): భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రా వు గురువారం రాత్రి హైదరాబాద్ కారులో వెళ్తుండగా పంతంగి టోల్ గేట్ సమీపంలో ఆయన కారు లారీని వెనక నుంచి ఢీ కొట్టింది. ఎమ్మెల్యే కారు ఈ ప్రమాదంలో స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే సురక్షితంగా బయట పడినప్పటికీ కొంత అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. తదుపరి అదే వాహనంలో హైదరాబాద్‌కు ఎమ్మెల్యే బయలుదేరారు.