11-09-2025 04:40:04 PM
జనగామ (విజయక్రాంతి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జనగామ జిల్లా ఆధ్వర్యంలో పెండింగ్ లో 8500 వేల కోట్లు ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ గుంటుపల్లి కార్తీక్(District Convener Guntupalli Karthik) మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు రావలసినటువంటి స్కాలర్షిప్ లను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ బకాయిలు, విడుదల చేయకపోవడంతో వారు చదువులకు దూరమవుతున్నారు. పై తరగతిలకు వెళ్లాలంటే వారి యొక్క సర్టిఫికెట్ కళాశాల యజమాన్యాలు ఇవ్వకపోవడంతో ఆందోళన గురవుతున్నారు.
విద్యార్థులు, ఇబ్బందులు పడతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విద్యార్థులను, పట్టించుకోకుండా విద్యార్థి, వ్యతిరేక విధానాలతో ముందుకుపోతుంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం వెంటనే విద్య రంగ సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఏబీవీపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తుంది అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సాయి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేందర్, వంశీ, సాయి చరణ్, రాహుల్ దుర్గ ప్రసాద్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.