11-09-2025 04:43:41 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): అప్రమత్తత, నాణ్యమైన విద్యుత్తు పరికరాల వినియోగంతో విద్యుత్తు ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చని ట్రాన్స్కో ఏడీఈ మచ్చ ఐలయ్య తెలిపారు. మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మండలంలోని తెల్ల బండలో పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ పొలాల దగ్గర స్టార్టర్ లకు, మోటార్ లకు ఎర్తింగ్ చేసుకోవాలని అలాగే ఇంటి దగ్గర కూడా ఎర్తింగ్ చేసుకోవాలని తెలిపారు. దుస్తులు ఆరవేయడానికి ఐరన్ వైర్ వాడకూడదన్నారు. వర్షాకాలంలో చెట్లు విరిగి లైన్ పై పడడం, లైన్ తెగి కింద పడిపోయినప్పుడు వెంటనే రైతులు విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. విద్యుత్ ప్రమాదాల సమయంలో విద్యుత్ టోల్ ఫ్రీ నంబర్ 1912 ఉపయోగించుకోవాలని తెలిపారు.