calender_icon.png 11 September, 2025 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలు అతిక్రమిస్తె ఫర్టిలైజర్ లైసెన్స్ రద్దు

11-09-2025 04:26:38 PM

కోరుట్ల డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు రమేష్

కోరుట్ల (విజయక్రాంతి): నిబంధనల ప్రకారం ఎరువుల విక్రయాలు చేయక అతిక్రమిస్తే ఫర్టిలైజర్ లైసెన్స్ రద్దు చేస్తామని జగిత్యాల జిల్లా కోరుట్ల డివిజన్  వ్యవసాయ సహాయ సంచాలకులు రమేష్ అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం మండలంలోని పలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ లలో  కోరుట్ల డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు రమేష్  అకస్మిక తనిఖీ నిర్వహించారు.  స్టాక్ రిజిస్టర్ మరియు ఈపోస్ లో ఎరువుల అమ్మకాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎరువుల విక్రయాలలో నిబంధనలు తప్పకుండా పాటించాలని, ఎరువుల అమ్మకాలు తప్పనిసరిగా ఈపోస్ ద్వారా చేపట్టాలన్నారు. అమ్మకాలకి సంబందించిన రిజిస్టర్ తప్పనిసరిగా మెయింటెయిన్ చేయాలని, లేనిచో ఫర్టిలైజర్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందన్నారు. రైతులకి అవసరం మేరకే యూరియా విక్రయించాలని అధిక మొత్తంలో కొందరికే ఇవ్వరాదని,రైతులు కూడా అవసరం మేరకే యూరియా కొనుగోలు చేసి కృత్రిమ కొరత సృష్టించకుండ సహకరించాలని సుచించారు. ఈకార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి అకు రాజ్ కుమార్,సహకారసంఘ  కార్యదర్శులు సతీష్, మహేందర్ సంపత్  సిబ్బంది పాల్గొన్నారు