11-09-2025 04:29:51 PM
హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ నయీంనగర్ లోని తేజస్వి స్కూల్(Tejaswi School)లో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న జయంత్ వర్ధన్(15) అనుమానాస్పద మృతిచెందాడు. రోజులాగే ఉదయం స్కూల్ కి వెళ్ళిన జయంత్ వర్ధన్ మధ్యాహ్నం అకస్మాత్తుగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు స్కూల్ యాజమాన్యం సమాచారం అందించారు. బాలుడి ముక్కు నుంచి రక్తం ఆనవాళ్లు ఉన్నాయని, యాజమాన్యమే విద్యార్థిని కొట్టి చంపేశారని తల్లితండ్రుల ఆరోపిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.