14-05-2025 10:40:16 PM
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసి యువతిపైన దాడి కేసులో నిందితుడికి 7 సంవత్సరాల 6 నెలలు జైలు శిక్ష జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(District SP Sharat Chandra Pawar) బుధవారం తెలిపారు. నల్లగొండ మండల పరిధిలోని మేళ్ల దుప్పలపల్లి గ్రామానికి చెందిన మనిమద్దె సాయిరాం @ సాయిరాం సుకేష్, కాకులకొండారం గ్రామానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో వేధిదింపులకు గురి చేస్తూ దాడి చేసినందుకు గాను బాధితురాలు పిర్యాదు మేరకు నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి కోర్టులో ఛార్జ్ సమర్పించగా నిందితుడికి బిఎన్ఎస్ సెక్షన్ 76 కింద 4 సంవత్సరాలు రూ.1000/- జరిమానా, బిఎన్ఎస్ సెక్షన్ 78 కింద 2 సంవత్సరాలు రూ.1000/- జరిమానా, బిఎన్ఎస్ సెక్షన్ 115(2) 6 నెలలు రూ.5000/- జరిమానా, బిఎన్ఎస్ సెక్షన్ 351(2) కింద 1 సంవత్సరం రూ.1000/- జరిమానా, (మొత్తం 7 సంవత్సరాల 6 నెలల జైలు 8000 వేల జరిమానా) అన్ని నేరాలు ఏకకాలంలో అమలు చేయబడతాయని ఫ్యామిలీ కోర్ట్ తీర్పు వెలువడించిందని జిల్లా ఎస్పీ తెలిపారు.
కేసు వివరాలు...
నల్లగొండ మండలం కాకులకొండారం గ్రామానికి చెందిన యువతి కంచనపల్లి గ్రామంలో 08-08-2024 రోజున జడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు ట్రైనీ టీచర్ గా పని చేస్తున్న క్రమంలో మనిమద్దె సాయిరాం @ సాయిరాం సుకేష్ తండ్రి తిరుపతయ్య, మేళ్ల దుప్పలపల్లి గ్రామం, నల్లగొండ మండలం అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని సదరు బాధితురాలు డయల్ 100 కి కాల్ చేయగా, నల్గొండ రూరల్ పోలీస్ లు అక్కడికి చేరుకునేసరికి సాయిరాం అనే వ్యక్తి అక్కడి నుంచి పరారైనాడు. ఫిర్యాదురాలి దరఖాస్తు మేరకు నల్లగొండ రూరల్ ఎస్సై డి సైదా బాబు వెంటనే Cr. No 166/2024 U/s 78(1)(i), 115(2), 351(2), 49 BNS సెక్షన్ల కింద కేసును రిజిస్టర్ చేసి నేరస్తుడిని పట్టుకొని 09/08/2024 రోజున రిమాండ్ తరలించారు.
ఇట్టి కేసులో త్వరితగతిన ఇన్వెస్టిగేషను పూర్తిచేసి తేదీ 19/09/2024 రోజున చార్జిషీట్ ను కోర్టుకు సమర్పించారు. బుధవారం ఫ్యామిలీ కోర్టు నేరస్తునిపై నేరం రుజువు కావడంతో ఏడున్నర సంవత్సరాల జైలు శిక్ష, 8000/- రూపాయల జరిమానా విధించారు. ఇట్టి కేసులో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి చార్జ్ షీట్ సరైన ఆధారాలను సేకరించి కోర్టులో సబ్మిట్ చేసి నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషిచేసిన నల్గొండ రూరల్ ఎస్సై సైదబాబు, కోర్ట్ కానిస్టేబుల్ దుర్గ రాజు, రైటర్ కానిస్టేబుల్ ఆంజనేయులు, సుమన్, శంకర్, రేవతిలను నల్గొండ టూ టౌన్ సీఐ రాఘవరావు, నల్గొండ డి.ఎస్.పి శివరాం రెడ్డిలను ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలపై చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడిన వారిని ఎవరిని ఉపేక్షించేది లేదని చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.