calender_icon.png 15 May, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వలస కార్మికుల శ్రమను దోచుకుంటున్న యాజమాన్యాలు

15-05-2025 12:00:00 AM

  1. దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి 
  2. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్

ఇబ్రహీంపట్నం, మే 14:  వలస కార్మికుల శ్రమను కంపెనీ యాజమాన్యాలు దో చుకుంటున్నారని, దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ అన్నారు. బుధవా రం ఇబ్రహీంపట్నం పారిశ్రామిక ప్రాం తం లో మెహక్ ఇంటర్నేషనల్ కంపెనీ, వైట్ గో ల్ కార్మికులతో సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ పాల్గొని మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలు రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్‌లుగా తీసుకువచ్చారని, కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా చట్టాలను తీసుకొస్తున్నారనీ అన్నారు. 135 సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న ఫలితంగా ౧౮ గంటల పని దినా లను, 12 గంటలకు పెంచారనీ తెలిపారు.

కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంత చేయాలని, దేశంలో సంపద సూచించేది కార్మికులేనన్నారు. దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు బ్యాంకు ఫెడరేషన్లు అందరూ ఏకమై దేశవ్యాప్త సమ్మేను చేయబోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ టీయూ జిల్లా ఉపాధ్యక్షులు డి.జగదీష్, జిల్లా సహాయ కార్యదర్శి స్వప్న, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కన్వీనర్ చింత పట్ల ఎల్లేశ, మంచాల మండల కన్వీనర్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.