02-05-2025 12:00:00 AM
ఇల్లెందు, మే 1 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియాలో ఏప్రిల్ నెలలో 82 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించారు.సింగరేణి ఇల్లందు ఏరియా జిఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఏప్రిల్ నెల బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను ఏరియా జి.యం కృష్ణయ్య తెలిపారు. ఏప్రిల్ -2025 నెలకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి 3.10 లక్షల టన్నులకు గాను 2.56 లక్షల టన్నుల బొగ్గు తీసి మొత్తం 82 శాతం ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు.
అలాగే 1.42 లక్షల టన్నుల బొగ్గు రైల్వే మార్గం ద్వారా, 0.36 లక్షల టన్నులు రోడ్డు మార్గం ద్వారా మరియు ఆర్.సి.హెచ్.పి ద్వారా 0.33, ఇల్లందు ఏరియా లో మొత్తం 2.11 లక్షల టన్నుల బొగ్గు బట్వాడా చేయడం జరిగింది. ఏప్రిల్ నెలలో 37 రేకుల ద్వారా బొగ్గు రవాణా చేసామని తెలిపారు.
అదేవిధంగా ఇల్లందు ఏరియాకు కేట౦చిన వార్షిక బొగ్గు లక్ష్యం 50.0 లక్షల టన్నులకు గాను 2.56 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసున్నాము. రక్షణతో మరియు క్వాలిటీ తో కూడిన బొగ్గు ఉత్పత్తికి కృషి చేసిన సంబంధిత అధికారులు, సూపర్వై జర్స్, యూనియన్ నాయకులకు మరియు ఉద్యోగులకు జి.యం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.