27 August, 2026 | 1:53 AM

నీట్ పీజీ ప్రవేశ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఏసీపీ

27-08-2026 12:49 AM

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 26 (విజయక్రాంతి): ఈ నెల 30న జరగనున్న నీట్ పీజీ నీట్ పీజీ  ప్రవేశ పరీక్ష నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పరీక్షా కేంద్రం భద్రతా ఏర్పాట్లను బుధవారం, ఇబ్రహీంపట్నం  ఏసీపీ రాజు  ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. శ్రీ చక్ర కాలేజీ టీ సీ ఎస్,ఐ ఒన్ డిజిటల్, లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంను సందర్శించారు.

ఈ సందర్భంగా సీసీటీవీ కెమెరాల పనితీరు, పార్కింగ్ ఏర్పాట్లు, ప్రవేశ  నిష్క్రమణ మార్గాలు,  భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్డులకు ఎలాంటి సమస్యలు ఎదురవకుండా అభ్యర్డులతో పాటు వారి తల్లి తండ్రులకు కూడా పరీక్ష పూర్తయ్యేవరకు వసత ఏర్పాట్లపై సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు. నీట్ పీజీ ప్రవేశ పరీక్ష సాఫీగా నిర్వహించేందుకు ఇబ్రహీంపట్నం పోలీసులు అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపడుతున్నా మని అన్నారు.