పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యం
టీపీసీసీ నేతలు
మేడ్చల్ అర్బన్, ఆగస్టు 26 (విజయక్రాంతి): పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన పానుగంటి సువర్ణ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డితో కలిసి వారు ముఖ్య అతిథులుగా హాజరై, ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం లభిస్తుందని తెలిపారు. 297వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నడికొప్పు నాగరాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఏఎంసీ మాజీ చైర్మన్ సత్యనారాయణ, నాయకులు శివశంకర్, సాయిపేట శ్రీనివాస్, రమేష్, మహేష్, శేఖర్, సుహాసిని, వేముల శ్రీనివాస్ రెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.






