calender_icon.png 5 September, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతున్నల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎంపిఇఓ పై చర్యలుండవ?

05-09-2025 08:45:20 AM

ప్రశ్నిస్తున్న నెలకొండపల్లి రైతన్నలు

ఖమ్మం,(విజయక్రాంతి): అన్నం పెడుతున్న అన్నదాతలను నెత్తున పెట్టుకోవాల్సింది పోయి కార్యాలయం నుండి బైటకి పొండని అత్యంత దురుసుగా ప్రవర్తించిన నెలకొండపల్లి ఎంపిఇఓ పై చర్యలు ఉండవా అని నెలకొండపల్లి రైతున్న లు ప్రశ్నిస్తున్నారు. యూరియా అడగటము ఏమైనా నేరమా ముసలి వయసున్న రైత్తన్నలని కూడా చూడకుండా వారిని తోస్తూ కార్యాలయం నుండి బైటకు పోవాలని దురుసుగా మీదకు రావటమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే బుధవారం నెలకొండపల్లి రైతులు యూరియా కోసం సొసైటీ కి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ వున్న స్పెషల్ ఆఫీసర్ ఐన నెలకొండపల్లి ఎంపిఇఓ కు రైతులకు మధ్య కొంత వాగ్వాదం జరిగింది. దింతో ఎంపీఇఓ ఒకానొక దశలో వయసు పై బడిన రైతన్న లపై చేతులు వేసి తోస్తూ బయటకు పోండి అని, యూరియా లేదు ఏమిచేసుకొంటారో చేసుకోండి, కోర్ట్ లో వేసుకొండని దురుసుగా ప్రవర్తించారు. ఆ సమయంలో పోలీసులు కలుగజేసుకొని రైతులకు సర్ది చెప్పారు. ఆ విధంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని నెలకొండపల్లి రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు నివేదిక అందినట్లు సమాచారం.