05-09-2025 10:18:52 AM
ఉపాధ్యాయ దినోత్సవం.. నేడు అవార్డుల ప్రదానం చేయనున్న సీఎం
హైదరాబాద్: తరగతి గదుల్లో దేశ భవితను తీర్చిదిద్దే మార్గదర్శకులు, సమాజానికి జ్ఞానాన్ని పంచుతున్న గురువులందరికీ.. భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకష్ణన్ జయంతి(Sarvepalli Radhakrishnan birth anniversary) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నేడు శిల్పకళా వేదికలో టీచర్స్ డే(Teachers Day) కార్యక్రమం నిర్వహించున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు సీఎం అవార్డులు ప్రదానం చేయనున్నారు. జీహెచ్ఎంసీ కేటగిరీలో జెడ్పీహెచ్ఎస్ బోర్గోన్ పాఠశాల హెడ్ మాస్టర్ సీహెచ్ శంకర్ ఎంపికయ్యారు. పాఠశాలస్థాయిలో 7 కేటగిరిలో ఉపాధ్యాయులకు అవార్డులు వరించనున్నాయి. పాఠశాల విద్యాశాఖలో 57 మందికి ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. ఇంటర్ విద్యలో 11 మందికి అవార్డులు ప్రకటించింది. వివిధ యూనివర్సిటీల్లో 60 మందికి తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ఇవ్వనుంది.