calender_icon.png 5 September, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

05-09-2025 02:07:21 AM

-ప్రముఖ ఆర్కిటెక్ట్ చేతిలో కాప్రా టౌన్ ప్లానింగ్ విభాగం

- కాప్రా టౌన్ ప్లానింగ్ పనితీరుపై ప్రజల్లో ఆగ్రహం

- అధికారులకే సవాలు విసురుతున్న అక్రమ నిర్మాణదారులు

- కుర్చీలకే పరిమితం అవ్వుతున్న అధికారులు

కాప్రా, సెప్టెంబర్ 4(విజయక్రాంతి) : కాప్రా సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు రోజు రోజుకీ పెరుగుతున్నా వాటిని అడ్డుకునే చర్యలు కనిపించకపోవడం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. టౌన్ ప్లానింగ్ విభాగం ఒక ప్రముఖ ఆర్కిటెక్ట్ ప్రభావంలో నడుస్తోందనే ఆరోపణలు బహిరంగ చర్చకు దారి తీస్తున్నాయి.

ఏఎస్ రావు నగర్లో అనుమతులు లేకుండా సెల్లార్ నిర్మాణం జరుగుతుండగా, కుషాయిగూడ ప్రగతి స్కూల్ వెనుక ప్రాంతంలో కూడా అక్రమ నిర్మాణాలు బహిరంగంగా సాగుతున్నాయి. స్థాని కులు పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీని వలన పరిస్థితి మరింత దిగజారిపోతోందని వారు వాపోతు న్నారు.

నియమాలు అందరికీ సమానంగా ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం కొందరు ప్రభావవంతులు టౌన్ ప్లానింగ్ అధికారులను తమ చేతుల్లో నడిపిస్తూ అక్రమ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు అని స్థానికులు మండిపడుతున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి చేయాల్సిన విభాగం అక్రమాలకు అడ్డాగా మారడం హాస్యాస్పదమని వారు విమర్శిస్తున్నారు.

ప్రజల డిమాండ్ స్పష్టంగా ఉంది  వెంటనే అక్రమ నిర్మాణాలను నిలిపివేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరీ చూడాలి ఇప్పటికైనా కాప్రా టౌన్ ప్లానింగ్ అధికారులు వీటిపై చేర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.

అక్రమ నిర్మాణాలు సహించేదేలేదు

వివరణ కోరగా ప్రస్తుతం మున్సిపాలిటీలోని అక్రమ నిర్మాణాలపై తనిఖీలు నిర్వహిస్తాం. ఈ అక్రమ నిర్మాణం ఇంకా మాదృష్టికి రాలేదు, తనిఖీలు నిర్వ హించి అనుమతులు లేకపోతే తగు చేర్యలు తీసుకుంటామన్నారు.

 తుల్జా సింగ్, కాప్రా సర్కిల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్