05-09-2025 09:37:35 AM
హైదరాబాద్: మిలాద్–ఉన్-నబీ(Milad-un-Nabi) పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ముస్లిం సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, ప్రేమ, సహనం, త్యాగం, సేవ మార్గంలో జీవించాలనే అల్లాహ్ సందేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్ ఉన్ నబీ ముస్లింలకు అత్యంత పవిత్రమైన రోజని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka Mallu) ఎక్స్ లో ''నా ముస్లిం సోదర సోదరీమణులందరికీ మిలాద్-ఉన్-నబి శుభాకాంక్షలు'' పోస్ట్ చేశారు. ప్రపంచానికి శాంతి, కరుణ, ఐక్యతల సందేశం ఇచ్చిన మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఎక్స్ లో పోస్ట్ చేశారు.