calender_icon.png 6 September, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీబీఐ తేల్చేనా?

05-09-2025 01:08:41 AM

-కాళేశ్వరం కేసు కొలిక్కి వచ్చేదెప్పుడు? 

-20 ఏళ్లకు పైగా సీబీఐలో కేసుల పెండింగ్ 

-7 వేలకు పైగా అవినీతి కేసుల విచారణ ఇంకా కోర్టుల్లోనే 

-2010 కంటే ముందు 70% పైగా సీబీఐ శిక్షా రేటు

-కేసుల్లో 40% కూడా నేర నిరూపణ కాలేదంటున్న గణాంకాలు క్రాంతి మల్లాడి

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : ఇటీవల కాలంలో రాష్ట్రమంతా కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్, హరీశ్‌రావు పేర్లు విస్తృతంగా వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ద్వారా విచారణ చేపట్టి, ఆ కమిషన్ నివేదికపై అసెంబ్లీలోనూ చర్చ జరపడమే.

చర్చ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోని లోపాలు, అవినీతి ఆరోపణలు, జరి గిన అవకతవకలను బయటపెట్టేందుకు కేసును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభు త్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కానీ దర్యాప్తు చేపట్టే సీబీఐపైనే పెదవి విరుపులు కనిపిస్తున్నాయి. గత కొన్ని ఏళ్లుగా సీబీఐ చేపట్టిన కేసులు, శిక్షా రేటు, నేర నిరూపణ వంటి అంశాలు ఈ నిర్లిప్తతకు కారణం అవుతున్నాయి.

సీబీఐ పనితీరు రోజురోజుకీ నిరాశాజనకంగా ఉంటోందనే వాదన వినిపిస్తోంది. అవినీతి కట్టడికి ప్రతి రాష్ర్టంలో ఏసీబీ ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఉండాలనే ఉద్దేశంతో సంక్లిష్టమైన, హైప్రొఫైల్ కేసుల్ని సీబీఐకి అప్పగిస్తూ వస్తున్నారు. కానీ గత రెండు దశాబ్దాలుగా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సీబీఐకి మాత్రం చెడ్డపేరు వస్తున్నది. సీబీఐ గణాంకాలు పరిశీలిస్తే ఆ సంస్థ ఛేదించిన కేసుల కంటే, పెండింగ్ కేసులే అధికంగా ఉన్నాయని స్పష్టమవుతున్నది. 

 సీబీఐ దర్యాప్తు చేస్తున్న 7,072 అవినీతి కేసుల విచారణ వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో 379 కేసులు 20 సంవత్సరాలకు పైగా ఉన్నాయని సెంట్రల్ విజి లెన్స్ కమిషన్(సీవీసీ) తాజా వార్షిక నివేదిక తెలిపింది. డిసెంబర్ 31, 2024 నాటికి మొ త్తం కేసుల్లో 1,506 కేసులు మూడు సంవత్సరాల కంటే తక్కువ కాలం, 791 కేసులు మూడు నుంచి ఐదు ఏళ్ల మధ్య, 2,115 కేసు లు ఐదు నుంచి 10 ఏళ్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది.

2,281 అవినీతి కేసు లు 10 నుంచి 20 ఏళ్లుగా, 379 కేసులు 20 ఏళ్ల కంటే ఎక్కువ కాలం విచారణ పెండింగ్‌లో ఉన్నాయని యాంటీ కరప్షన్ వాచ్ డాగ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక తెలిపింది. నివేదిక ప్రకారం సీబీఐ, నిందితులు దాఖలు చేసిన 13,100 అప్పీళ్లు వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నా యి. వీటిలో 606 అప్పీళ్లు 20 ఏళ్లకు పైగా, 1,227 అప్పీళ్లు 15 నుంచి 20 ఏళ్లు, 2,989 అప్పీళ్లు 10 నుంచి 15 ఏళ్లు, 4,059 అప్పీళ్లు ఐదు నుంచి 10 ఏళ్లు, 1,778 అప్పీళ్లు రెండు నుంచి ఐదు ఏళ్లు, 2,441 అప్పీళ్లు రెండేళ్ల లోపు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. 2024లో 644 కేసుల్లో తీర్పులు వెలువడ్డాయి.

వీటిలో 392 కేసుల్లో దోషులు, 154 కేసుల్లో నిర్దోషులుగా తేలారు. 21 కేసులను డిస్‌ఛార్జ్ చేయగా, 77 కేసులను ఇతర కారణాలతో కొట్టివేసినట్టు తెలిపింది. 2024 చివరి నాటికి, అవినీతియేతర కేసులు సహా 11,384 కోర్టు కేసులు వివిధ కోర్టులలో విచారణలో పెండింగ్‌లో ఉన్నాయని స్పష్టం చేసింది. 2024లో సీబీఐ 807 కేసులు నమోదు చేసిందని, వాటిలో 674 సాధారణ కేసులు కాగా, 133 ప్రాథమిక విచార ణలు ఉన్నాయని సీవీసీ నివేదిక పేర్కొంది.

807 కేసుల్లో 111 కేసులు న్యాయస్థానాల ఆదేశాల మేరకు, 61 కేసులు రాష్ర్ట ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చి న సూచనల ఆధారంగా విచారణ చేపట్టినట్టు తెలిపింది. 2024లో 1,005 కేసుల్లో సీబీఐ దర్యాప్తు పూర్తి చేయగా ఏడాది చివరినాటికి మొత్తం 832 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది. డిసెంబర్ 31, 2024 నాటికి సీబీఐ నమోదు చేసిన మొ త్తం 529 అవినీతి కేసులు దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 56 కేసులు ఐదేళ్లకు పైగా, 60 కేసులు మూడేళ్లకుపైగా, 64 కేసు లు రెండేళ్లకుపైగా, 64 కేసులు మూడేళ్లకుపైగా, 108 కేసులు ఏడాది నుంచి రెండేళ్ల లోపు, 241 కేసులు ఏడాది కంటే తక్కువ కా లంగా పెండింగ్‌లో ఉన్నాయి. 

నేర నిరూపణలో వెనుకబాటు..

సీబీఐతో పాటు ఈడీని కుడా రాజకీయ జోక్యం లేకుండా స్వయం ప్రతిపత్తి గల సం స్థలుగా తీర్చిదిద్దనంతవరకు ఆ సంస్థలు ప్ర త్యర్థి రాజకీయ నాయకులపై చేసే దాడులు, పెట్టే కేసులపై అనేక అనుమానాలు, ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. సీబీఐ విచారించిన కేసు ల్లో 2021 నాటికి శిక్షా రేటు 60 శాతంగా ఉంది.

ఈ శిక్షా రేటు 2010కి ముందు 70 శాతం వరకు ఉండేది. మద్రాస్ హైకోర్టుకు సమర్పించిన సమాచారాన్ని బట్టి సీబీఐ పెట్టిన కేసుల్లో 40 శాతం కూడా నేర నిరూపణ కాలేదు. సీబీఐ నేరారోపణ చేసినట్ల యతే నేరం నిరూపించాల్సిన బాధ్యత సీబీఐపైనే ఉంటుంది. కానీ సగం కేసుల్లో కూడా నేర నిరూపణ చేయకపోవడం గమనార్హం.

న్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేరం ఆరోపిస్తుంది. ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి తాను నిర్దోషినని నిరూపించుకోవాలి. కానీ ఈడీకి నేర నిరూపణ బాధ్యత ఉండదు. లో క్‌సభలో ఆర్థికశాఖ సహాయ మంత్రి చెప్పిన వివరాల ప్రకారం 2004- మధ్యకాలం లో 112 ఈడీ సోదాలు జరిగాయి. వీటిలో రూ. 5,346.16 కోట్ల ఆస్తులను అటాచ్ చేశా రు. 104 ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు నమోదయ్యాయి. కానీ మోడీ హయాంలో 2014- 22 మధ్యకాలంలో ఏకంగా 2,974 సోదా లు జరిగాయి. రూ.95,432.08 కోట్ల ఆస్తుల అటాచ్‌మెంట్లు, 839 ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు నమోదైనట్టు గణాంకాలు చెబు తున్నాయి. 

దిగజారుతున్న సీబీఐ ప్రతిష్ట..  

సీబీఐ గత పదేళ్లలో టేకప్ చేసి న కేసుల్లో అధిక శాతం కొలిక్కిరాకపోవడం కూడా దర్యాప్తు సంస్థ ప్రతి ష్ఠను దెబ్బతీసింది. సీబీఐ డైరక్టర్, జాయింట్ డైరక్టర్ ఓ కేసు విషయం లో ఘర్షణ పడటం సీబీఐని మరిం త భ్రష్టు పట్టించింది. కోల్ స్కామ్, కామన్వెల్త్ స్కామ్ వంటి చాలా కేసు లు ఇంకా తేలలేదు.

కేవలం కేసుల నమోదు సమయంలో సెన్సేషనే తప్ప.. ఫలితం మాత్రం వెలువడటం లేదు. సీబీఐకి చిత్తం వచ్చినట్టుగా దర్యాప్తు వేగవంతం చేయడం, ఇష్టం లేకపోతే కేసులు సాగదీయటం లాం టి ధోరణులు కూడా విమర్శలకు కారణమవుతున్నాయి. సీబీఐ కేసు లు నమోదు చేసినంత స్థాయిలో శిక్ష లు పడకపోడవం ఆ సంస్థ విశ్వసనీయతకు భంగం కలిగిస్తోంది. కేంద్రం లో అధికారంలో ఉన్నవారి ఆదేశాల మేరకు విచారణ చేసే తీరు కూడా సీబీఐకి తలవంపులు తెచ్చింది.

లక్ష ల కోట్ల కుంభకోణం జరిగిపోయిం ది.. దేశ సంపద లూటీ చేశారనే సం చలన ఆరోపణలతో కేసులు నమో దు చేసే సీబీఐ, ఏళ్ల తరబడి విచారణ సాగదీసి.. కొండను తవ్వి ఎలు కను పడుతోంది. గతంలో సీబీఐ దర్యాపులంటే అవినీతిపరుల్లో భ యం ఉండేది. కానీ ఇప్పుడు సీబీఐని మేనేజ్ చేయడానికి చాలా పద్ధతులున్నాయన్న దుస్థితి వచ్చిం ది. సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా ఉండాలి. కానీ స్వ యం ప్రతి పత్తి గల సంస్థలపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఆధిపత్యం ప్రదర్శించాలని చూడ టం వాటికి చెడపేరు తెస్తున్నది. 

కాళేశ్వరం కొలిక్కి వచ్చేదెప్పుడో..

కేసులను దర్యాప్తు చేయడంలో సీబీ ఐ అవలంభిస్తున్న జాప్యం చేసే ధోరణిపై సర్వత్రా అనుమానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాళేశ్వరం అవినీతి కేసు ను సీబీఐకి అప్పగించింది. ప్రాజెక్టు స్థలం మార్పు, నిర్మాణ వ్యయాన్ని ఏకంగా లక్ష కోట్లకుపైగా పెంచిన నేపథ్యంలో దీనిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటి పారుదల శాఖ మం త్రి హరీష్‌రావు ప్రధాన నిందితులుగా ఉన్నారు.

వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అధికారం కో ల్పోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టులోని బ రాజ్ కుంగుబాటే ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో 2028 అసెంబ్లీ ఎన్నికల లో పు కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు పూర్తి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. కానీ సీబీఐ దర్యాప్తులో జరిగే జాప్యం పరిశీలిస్తే అంత త్వరగా కాళేశ్వరం కేసు దర్యా ప్తు పూర్తి అవుతుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం జనరల్ కన్సెంట్‌ను ఎత్తేసి మరీ సీబీఐని రాష్ట్రంలోకి ఆహ్వానించి కాళేశ్వరం కేసు అప్పగించింది. ఈ క్రమంలో సీబీఐ కేసు దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయడంపై దృష్టి సారిస్తుందో, లేదో చూడాలి. అయి తే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై కమిషన్ వేసి విచారణ జరిపించింది.

కేసును సీబీఐకి అప్పగించింది. దర్యాప్తు పూర్తిచేసి దోషులను బయటపెడితే కాంగ్రెస్‌కు రాజకీయంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఆ రకమైన అవకాశం ఇవ్వడానికి కేంద్రంలోని బీజేపీ సిద్ధంగా లేనిపక్షంలో సీబీఐ దర్యాప్తులో తప్పనిసరిగా జాప్యం జరుగుతుంది. ఈ క్రమంలో నిందితులుగా భావిస్తున్న వారు తప్పించుకునే అవకాశం ఉన్నది. దీంతో కాళేశ్వరం కేసులో సీబీఐ దర్యాప్తు తీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.