దోభి ఘాట్ బస్తీలో ఈదమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారికి విగ్రహ ప్రతిష్ఠాపన
గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
ముషీరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్‌లోని దోభీ ఘాట్‌లో పునర్నిర్మాణం జరిగిన ఈదమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ సోమవారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దోభీ ఘాట్ బస్తీ నాయకులు మాజీ కార్పొరేటర్, బీజేపీ నాయకులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు రత్న సాయిచంద్, శ్రీకాంత్, దామోదర్, పాల శ్రీనివాస్, ఆనంద్ రావు, జ్ఞానేశ్వర్, సాయిగౌడ్, శ్యామ్, బస్తీ ఆలయ కమిటీ సభ్యులు వెంకటేష్, నగేష్, డి.రమేష్, సి. సురేష్, ఎ. విష్ణు, మల్లికార్జున్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.






