22 August, 2026 | 1:51 AM

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు

22-08-2026 12:05 AM

ఏఎస్పి రిత్విక్ సాయి కొట్టే 

ఉట్నూర్, ఆగస్టు 21: ఉట్నూర్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో ప్రజలు, యువత అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఉట్నూర్ ఏఎస్పి రిత్విక్ సాయి కొట్టే అన్నారు. శుక్రవారం ఉట్నూర్ పోలీస్ సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఇంద్రవెల్లి, నార్నూర్, గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం ప్రత్యేక వాహన తనిఖీలు, గ్రామాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించామన్నారు.

ఇందులో ఇంద్రవెల్లి డొంగర్ గావ్ ని నిర్వహించిన తనిఖీల్లో నిబంధనల మేరకు లేని 37 ద్విచక్ర వాహనాలను, నార్నూర్ మల్లెంగిలో నిర్వహించిన తనిఖీల్లో 30 మోట్సాకిళ్లు, నాలుగు ఆటోలను, అదేవిధంగా 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశామన్నారు. గుడిహత్నూర్ లోని ముత్నూర్ తండాలో నిర్వహించిన తనిఖీల్లో 32 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ప్రత్యేక తనిఖీలు,కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లలో ఉట్నూర్ సీఐ మడవి ప్రసాద్, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.