22 August, 2026 | 1:54 AM

విజయక్రాంతి రిపోర్టర్‌పై హత్యాయత్నం

22-08-2026 12:06 AM

దాడి, బెదిరింపులకు పాల్పడిన ఆంధ్రప్రభ విలేకరిపై కేసు

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు21 (విజయక్రాంతి): విజయక్రాంతి దినపత్రిక రి పోర్టర్ను బెదిరించి, కర్రతో దాడి చేసి హత్యాయత్నం చేసిన ఆంధ్రప్రభ రిపోర్ట్ప బోయి న్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పో లీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోయిన్పల్లి లో నివాసముండే సీఎస్ వివిఎస్ కే మాణిక్యాల రావు విజయక్రాంతి సికింద్రాబాద్ కంటోన్మెంట్ రిపోర్టర్ గా పనిచేస్తు న్నారు. అక్కడే పనిచేసే ఆంధ్రప్రభ రిపోర్టర్ రామడుగు వెంకట్ మాణిక్యాల రావును కొంతకాలంగా వేధిస్తున్నాడు. 

’నువ్వు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాడివి.. నాకు నమస్కారం చేయాలి.. కంటోన్మెంట్ లో నేను చెప్పిందే వినాలి.. మీది చిన్న పత్రిక’ అంటూ తరచూ అవహేళన చేస్తున్నాడు. ప్రెస్‌మీట్లకు మాణిక్యాల రావును పిలవద్దని రాజకీయ నాయకులపై ఒత్తిడి తెస్తున్నాడు. కొంతకాల ంగా తనపై నిరంతరం ప్రాంతీయ విద్వేషా లు రెచ్చగొడుతూ బెదిరిస్తున్నాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడని చెప్పారు. తనను చంపుతానంటూ హెచ్చరించడంతో పాటు, ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతానని భ యబ్రాంతులకు గురిచేస్తున్నాడు అని తెలిపారు.

తాను నక్సలైట్లతో కలిసి పని చేశానని వెంకట్ తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నా డు. ఈ నెల 11న ఖార్ఖానా పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన రాజీవ్ రహదారి బాధితుల ధర్నా కార్యక్రమానికి సంబంధించి న్యూస్ కవరేజ్ కి వెళ్లిన తనతో ’ఆంధ్రోడికి ఎక్కువైం ది’ అంటూ అవహేళన చేశాడని.. అలా ఎం దుకు అంటున్నావని ప్రశ్నిస్తే, చంపేస్తానం టూ బెదిరించాడని బాధితుడు వాపోయా డు. ఈ నెల 18న బోయిన్పల్లి శ్రీ నల్ల పోచ మ్మ ఆలయం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమం కవరేజీకి వెళ్లిన సమయంలో కూడా వెంకట్ కర్రతో తనపై హ త్యాయత్నం చేశాడని బాధితుడు ఫిర్యాదు లో పేర్కొన్నారు.

అక్కడ విధుల్లో ఉన్న పో లీసు  అధికారి సబ్ ఇన్ స్పెక్టర్  ఆర్ రామకృష్ణ జోక్యం చేసుకున్నప్పటికీ ఆటో యూని యన్ డ్రైవర్తో దాడి కొనసాగించాడని ఆవేద న వ్యక్తం చేశారు. దాడికి  సంబంధించి ఆల యం సమీపంలోని సీసీ కెమెరాల దృశ్యాల ను పరిశీలించాలని బాధితుడు పోలీసులను కోరారు. అదేవిధంగా గంజాయి బ్యాచ్ లతో దాడి చేపిస్తానని బెదిరిస్తూ, ఈ నెల 17న ఉదయం బోయిన్పల్లి ఎక్స్రోడ్డులోని గల్ఫ్ బేకరీ సమీపంలో కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రయత్నం జరిగిందని, దీని వెనుక కూడా వెంకట్ ఉన్నాడని బాధితుడు అనుమానం వ్యక్తం చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించాలని కోరారు. తనను, తన కుటుంబ సభ్యులను బెదిరిస్తున్న వ్యక్తి పై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు, ప్రాణ రక్షణ కల్పించాలని మాణిక్యరావు పోలీసులను కోరారు. బాధితుడి ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గురుకుల రామకృష్ణ తెలిపారు.

2021లో రెవెన్యూ అధికారినంటూ బెదిరింపు

బోయినపల్లి తోకట్టలో శ్వేత అనే మహిళ 2021 డిసెంబరు నెలలో  కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టారు. అందుకు సంబంధించి బోరు వేస్తుండగా ఆంధ్రప్రభ విలేకరి రామడుగు వెంకట్ ఆమె వద్దకు వెళ్ళి తాము తిరుమలగిరి ఎమ్మార్వో కార్యాలయం నుంచి వచ్చామని, రెవెన్యూ సిబ్బంది అని చెప్పారు. ఈ బోరుకు అనుమతి లేదని, తనకు రూ.5వేలు ఇవ్వాలని, లేదంటే పనులు ఆపేస్తామని వేధించాడు. దీంతో సదరు మహిళ ఎమ్మార్వో కార్యాలయంలో విచారించగా అలాంటి వ్యక్తి తమ కార్యాలయంలో పనిచేయడం లేదని చెప్పారు.

దీంతో బాధిత మహిళ అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మార్వో కు ఫిర్యాదు చేయగా, ఆమె ఫిర్యాదు ఆధారంగా అప్పటి తిరుమలగిరి ఎమ్మార్వో విజయారెడ్డి ఆదేశాల మేరకు ఆర్‌ఐ అతనిపై  బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు రామడుగు వెంకట్ పై 2021డిసెంబరు 5న బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.

2010 లోనూ ఆంధ్రప్రభ కార్యాలయం రీజినల్ మేనేజర్ ను కూడా కులం పేరుతో బెదిరించడం అప్పట్లో కలకలం రేపింది.