calender_icon.png 8 January, 2026 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ కార్పొరేషన్ స్థలం కబ్జా దారునిపై చర్య తీసుకోవాలి

07-01-2026 04:45:23 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని చౌడేశ్వరి ప్రాంతంలోనీ  ఎస్సీ కార్పొరేషన్ దుకాణ సముదాయాల వెనక ఖాళీ స్థలాన్ని కబ్జా చేసి ఇంటి నంబర్ పొందిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని బీఅర్ ఎస్ వీ జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేశారు. మంగళవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవో హన్మంతరావుకి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా BRSV మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్ మాట్లాడుతూ గత 30 సం:ల క్రితం బెల్లంపల్లి పట్టణంలో SC కార్పొరేషన్  6 రూముల దుకాణ సముదాయాన్ని నిర్మించినదన్నారు. గత 15 సంవత్సరాల వరకు కూడా కార్పొరేషన్ అధికారులు వేలం పాట నిర్వహించి అర్హులు అయిన దళిత నిరుద్యోగులకు కేటాయించే వారనీ తెలిపారు.

ఈ పద్ధతిని  విస్మరించి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంగా ఆ దుకాణాలను పట్టించుకోక పోవడంతో శిథిలావస్థకు చేరే పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. గత సంవత్సరం కూడా అధికారులు వేలం నిర్వహిస్తున్నామని, కొంతమందికి అధికార పార్టీ నాయకులకు దుకాణాలు కేటాయించగా వారు ఎవరికి సబ్ లీజ్ కి ఇచ్చారో వారి ప్రభుత్వానికి ఎంత కడుతున్నారో కూడా తెలియని పరిస్థితి ఉందనీ తెలిపారు.

ఇదే అదునుగా భావించిన కొంత మంది కబ్జా దారులు దుకాణ వెనకాల ఉన్న ఖాళీ స్థలాన్ని కబ్జాచేసారనీ తెలిపారు.. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కాంగ్రెస్ అద్యక్షుడు ఆ వెనకా స్థలాన్ని కబ్జా చేసి ఇంటి నంబర్ (20345) కూడా పొందారని తెలిపారు. ఈ విషయంలో  అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుందనీ తెలిపారు. కబ్జా పై, ఎలాంటి విచారణ చేయకుండా ఇంటి నంబర్ కేటాయించిన వారిపై చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు. కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని వెంటనే అధీనంలోకి తీసుకుని దళిత నిరుద్యోగులకు కేటాయించాలి కోరారు.

బెల్లంపల్లి నియోజకవర్గన్నీ అనుకోని ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ PA లు ఎక్స్ప్రెస్ కంపెనీ ప్రతినిధులు విరేశం ఎలాంటి అర్హతలు లేని వారికి కేవలం దనర్జనే ద్యేయంగా రూ. 30,000 నుండి 50,000 వరకు వసూలు చేస్తన్నారని తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులను మోసం చేస్తున్న వారిపై MLA వినోద్ వెంటనే చర్యలు తీసుకొని కోరారు. అర్హులు అయిన నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనీ,  లేని యెడల బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని నిరుద్యోగులతో కలిసి ముట్టడి చేస్తామని హెచ్చరించారు.