ఆ కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి
రంగారెడ్డి, ఆగస్టు 6 (విజయక్రాంతి): ఫేక్ ర్యాంక్ లు ప్రచురించి,అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఐఏసీఈ(IACE) కోచింగ్ ఇనిస్టిట్యూట్ పై చర్యలు తీసుకోవాలని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు గురువారం గడ్డిఅన్నారం డివిజన్ లోని చైతన్యపురి మెయిన్ రోడ్డు పై ఉన్న ఐఏసీఈ కోచింగ్ సెంటర్ ఎదుట ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా ఓ యూ ఐక్య విద్యార్థి సంఘాల కన్వీనర్ నో ముల శేషు, బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మరబోయిన సైదులు తదితరులు మాట్లాడారు. ఆర్‌ఆర్ బీలో ఏఎల్ పీ జాబ్స్, కాంపిటీషన్ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించిన ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చైతన్యపురి లోని ఐఏసీఈ కోచింగ్ ఇనిస్టిట్యూట్ లో చదివినట్లు ప్రచురించుకుని, విద్యార్థి, నిరుద్యోగులను మోసం చేసి అత్యధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.
ఫేక్ ప్రకటనలు చేసి, మోసపూరి తంగా విద్యార్థుల వద్ద అడ్డగోలుగా కోచింగ్ ఫీజు వసూళ్లు చేయడం దుర్మార్గపు చర్య అ ని తెలిపారు. గడ్డిఅన్నారంలోని ఐఏసీఈ కో చింగ్ సెంటర్ లో సీబీటీ- 2 ఫ్రీ పరీక్ష పేరు తో విద్యార్థుల నుంచి రిజిస్టేషన్ నంబర్స్ తీ సుకొని మా కోచింగ్ సెంటర్ నుంచి ఆర్‌ఆర్ బీలో అసిస్టెంట్ లోకో పైలట్ కు అర్హత సా ధించారని సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆరోపించారు. ఇలాంటి నేరపూరితమైన చర్యలను సహించేది లేదని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం నియమాల ప్రకారం విద్యార్థుల నుంచి కన్సర్న్ లెటర్ తీసుకోకుండా ప్రకటనలు చేయడం అమాయకమైన వి ద్యార్థులను మోసం చేయడమేనని ఆరోపించారు. మోసపూరితమైన ప్రకటనలు, ఫలితా లతో విద్యార్థులను మోసం చేస్తున్న ఐఏసీ ఈ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం స రూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశా రు. ఈ కార్యక్రమంలో బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సైదులు యాదవ్, డీ ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శేషు, పీడీఎస్ యూ అధ్యక్షుడు వెంకటేశ్, టీఎస్ పీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్, జనసేన విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.






