7 August, 2026 | 2:30 AM

మక్కజొన్న క్వింటాల్@2,675

07-08-2026 12:00 AM

కేసముద్రం మార్కెట్‌లో ఆల్‌టైం రికార్డ్  

మహబూబాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): మక్కలు మద్దతుకు మించి ధర పలుకుతున్నాయి. మద్దతుధర క్వింటాకు2,400 కాగా, రెండు నెలల క్రితం వరకు ప్రైవేటు వ్యాపారులు రూ.1600 నుంచి రూ.1900లకు కొనుగోలు చేశారు. రైతులు నష్టపోకుండా మార్క్‌ఫెడ్ క్వింటాల్‌కు రూ.2400 చొప్పున  కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు మక్కలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రైవేట్ ట్రేడర్లు వరంగల్ మార్కెట్లో గరిష్టంగా రూ.2,675 రికార్డు ధర పెట్టగా, కేసముద్రంలో 2,629 రూపాయల ధర పెట్టారు. పక్షం రోజులుగా  ధర పెరుగుతూ 2600 మార్క్ దాటం రికార్డుగా చెబుతున్నారు.