calender_icon.png 29 August, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ నిబంధనలు పాటించని కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి

29-08-2025 12:33:39 PM

బిఆర్ఎస్వి దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ

దేవరకొండ: దేవరకొండ,కొండమల్లెపల్లి మండల కేంద్రలలో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారని బిఆర్ఎస్వి దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ ఆరోపించారు. శుక్రవారం వారు మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు లేకుండా పేద విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారని వారు తెలిపారు.నిమ్మకు నిరెత్తినట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులు అని వారు అన్నారు. దేవరకొండ పట్టణంలో సైనిక్,నవోదయ,గురుకుల మరియు ఇతర కోచింగ్ పేరిట హాస్టల్ అని చెప్తూ దాదాపు ఒక విద్యార్థికి లక్ష అరవై వేల రూపాయలు వసూలు చేస్తున్నారని వారు తెలిపారు.తక్షణమే అధికారులు చర్యలు తీసుకొని కోచింగ్ సెంటర్లు మూసివేయాలని వారు డిమాండ్ చేశారు.