calender_icon.png 29 August, 2025 | 2:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న కర్ణాటక మంత్రి

29-08-2025 12:35:45 PM

మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు

అనంతరం ప్రత్యేక పూజలు 

అలంపూర్: కర్ణాటక రాష్ట్ర మైనర్ ఇరిగేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి వర్యులు ఎన్ ఎస్ బోసురాజు సతి సమేతంగా కలిసి అలంపూర్ శ్రీ జోగుళాంబ ,బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను(Jogulamba Ammavari Temple) శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు.ముందుగా వీరికి దేవస్థానం అధికారులు అర్చకులు, పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు.అనంతరం ఉభయ ఆలయాల్లో మంత్రి  ప్రత్యేక పూజలు  నిర్వహించారు.మంత్రి వెంట ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వారి సతీమణి మహాలక్ష్మి ఉన్నారు.మంత్రితో  ఆలయ కమిటీ చైర్మెన్ నాగేశ్వర్ రెడ్డి కలిసి  దేవాలయ విశిష్టత ,అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో  వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మెన్ కుమార్,దేవాలయ కమిటీ సభ్యులు ,మార్కెట్ కమిటీ సభ్యులు,కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.