06-05-2025 12:00:00 AM
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ డిమాండ్
నిర్మల్ మే 5 (విజయక్రాంతి): దేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్థానీయులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంతో పా టు బైంసా నిర్మల్ ముధోల్ ఖానాపూర్ తదితర ప్రాంతాల్లో పార్టీ ఆదేశాల మేరకు అక్ర మ పాకిస్థాన్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అభిలాష అభినవ్ కు సోమవారం వినతి పత్రాన్ని అందించా రు.
దేశంలో ఉగ్రవాదాన్ని మోదీ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో వలస వచ్చిన వారిని గుర్తించడంలో విఫలమవుతుందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.