calender_icon.png 8 May, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పహల్గాం మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ : కల్నల్ సోఫియా ఖురేషి

07-05-2025 12:36:01 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత రక్షణ దళాలు బుధవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించింది. పాక్ లో భారత్ సైన్యం చేసిన ఉగ్రస్థావరాల వీడియోను కల్నల్ సోఫియా ఖురేషి(Colonel Sophia Qureshi), వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్(Wing Commander Vyomika Singh) విడుదల చేశారు. విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్త మీడియా సమావేశంలో కర్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. పహల్గాం మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసిన విషయం తెలిసిందే.

గత 30 ఏళ్లలో పాకిస్థాన్ ఉగ్రమూకలకు సౌకర్యాలు కల్పిస్తూ శిక్షణ ఇస్తోందని సోఫియా ఖురేషి పేర్కొన్నారు. పాక్ లోని 4, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో 5 శిబిరాలు మొత్తం 9 ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత దళాలు ధ్వంసం చేశాయని, పాకిస్థాన్ లోనూ, పీవోకేలోనూ ఉగ్ర శిబిరాలు ఉన్నాయన్నారు. ఈ ఆపరేషన్ లో మొత్తం 21 ఉగ్ర స్థావరాలను గుర్తించామని, చేసిన దాడుల్లో పాక్ పౌరులకు హాని కలగలేదని సోఫియా వెల్లడించారు.  ఈ సందర్భంగా కోట్లీలోని గుల్పూర్ టెర్రర్ క్యాంప్ పై ఎలా దాడి జరిగిందో ఆమె వీడియె ప్రదర్శించారు. ఇక్కడే గతంలో పూంచ్ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు శిక్షణ తీసుకున్నారంటూ వివరించారు.