calender_icon.png 8 May, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు గర్వించదగ్గ విషయం: పవన్ కల్యాణ్

07-05-2025 01:26:40 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో జరిగిన పహల్గాం ఉగ్రదాడికి(Pahalgam Terror Attack) భారత్ ప్రతీకరారం తీర్చుకుందని జనసేన అధినేత, ఆంధప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan) పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత రక్షణ దళాలు(Indian Defence Forces) బుధవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించింది. భారత సరిహద్దులో ఉగ్రవాదుల ఏరివేతకు సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్(Operation Sindoor)పై ఆయన స్పందించారు. పాక్ లో భారత్ సైన్యం మూడు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశారని, ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు గర్వించదగ్గ విషయం అని పవన్ పేర్కొన్నారు.

ప్రధాని మోదీ నిర్ణయానికి తామంతా అండగా ఉంటామని, ఉగ్రమూకలకు సంబంధించిన స్థావరాలను ధ్వంసం చేశారు. పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు గతంలో కశ్మీరి పండిట్ లను చంపారని అభిప్రాయపడ్డారు. దేశంపై దాడులను సీరియస్ గా తీసుకోవాలని, జాతీయ భద్రత గురించి ఎలాంటి పోస్టులు చేయవద్దన్నారు. భారత్ సైన్యానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఆపరేషన్ సిందూర్ ద్వారా భారతదేశం మొత్తాన్ని మళ్ళీ శౌర్య స్ఫూర్తితో నింపిన త్రివిధ సైన్యాల ధైర్య నాయకత్వానికి, వారికి అండగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు పవన్ కల్యాణ్ తెలిపారు.