07-05-2025 11:08:26 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత రక్షణ దళాలు లక్ష్యంగా దాడులు చేశాయనే నివేదికలకు ప్రతిస్పందనగా, దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు తమ ఆమోదం, ప్రశంసలను వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల నాయకులు ఈ ఆపరేషన్‌ను ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన మంత్రి కె.రామ్ మోహన్ నాయుడు కూడా స్పందించారు.
భారత దళాలు జరిపిన ఆపరేషణ్ సింధూర్ పై ఎక్స్ వేదికగా చంద్రబాబు స్పందిస్తూ.. “జై హింద్” అని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ సైతం జైహింద్.. న్యాయం జరిగింది అంటూ ట్వీట్ చేశారు. అలాగే మంత్రి కె.రామ్ మోహన్ నాయుడు కూడా స్పందిస్తూ.. ఉగ్రవాదాన్ని సహించేది లేదని, భారత్ మాతా కీ జై అని ట్వీట్ చేశారు.ఆపరేషన్ సంధూర్ పేరుతో చేపట్టిన దాడిలో భారత సైన్యం బాంబులతో పాక్ పై విరుచుకుపడింది. పాకిస్థాన్ అమెరికా దగ్గరకు పరుగులు పెట్టేలా చేసింది. ఈ క్రమంలో ఎక్స్ లో #IndiaPakistanWar, #OperationSindooor అనేది టాప్ లో ట్రెండ్ అవుతోంది.