calender_icon.png 8 May, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి

06-05-2025 12:00:00 AM

  1. ఆరుగురు మంత్రులను వెంటనే నియమించాలి

తెలంగాణ రక్షణ సమితి రాష్ర్ట అధ్యక్షుడు నరాల సత్యనారాయణ

ముషీరాబాద్, మే 5 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల ను వెంటనే పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలంగాణ రక్షణ సమితి(టీఆర్‌ఎస్) రాష్ర్ట అధ్యక్షుడు సత్యనారాయణ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 17 నెలలు గడచిన కొన్ని శాఖలకు మంత్రులను నియమిం చలేదని, ఆరుగురు మంత్రులను వెంటనే నియమించాలన్నారు.

సోమవారం బషీర్ బాగ్ దేశోద్దారక భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ళను అరులైన వారందరికీ మంజూరు చేయాలన్నారు. అరులకు రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించి పించన్ ఇవ్వాలన్నారు. స్వయం సహయ సంఘాలకు రూ.1 కోటి వరకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని అన్నారు.

రైతు కూలీలకు 12 వేల ఆర్ధిక సహయం ఇస్తామని హామీ ఇచ్చారని దీనిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. క్యాబ్, ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించాలని, కౌలు రైతులకు రూ.15 వేల రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి జీ శంకర్‌గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు, నాయకులు నర్సింగ్, సంపత్, స్వరూప, ఎం.సురేఖ, కె.మంజుల తదితరులు పాల్గొన్నారు.