calender_icon.png 8 May, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శ్రీ వాసవి జయంతి వేడుకలు

07-05-2025 01:36:35 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో కేసముద్రం మండల ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటి అధ్యక్షులు వోలం సత్యనారాయణ వాసవి మాత చిత్రపటానికి పూలమాల సమర్పణ చేయగా, కేసముద్రం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తొనుపునూరి వెంకటేశ్వర్లు వాసవి పతాకావిష్కకరణ చేసి ఉత్సవాలు ప్రారంభించారు.

అనంతరం నిర్వహించిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసముద్రం మండలంలోని సమస్త ఆర్యవైశ్యలందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బిజ్జాల ప్రభాకర్, వోలం గోవర్ధన గిరి, తేరాల సమ్మయ్య, వోలం చంద్రశేఖర్, మంచన శంకర్రావు, వోలం శ్రీనివాస్, మంచన శ్రీనివాస్, తవిడిశెట్టి రవీందర్, బచ్చు లక్ష్మినారాయణ, కొత్తపల్లి శేఖర్, చిల్లంచర్ల సతీష్, మాలెరవి, వోమ సంతోష్, శ్రీరాం చంద్రన్ తదితరులు పాల్గొన్నారు.