07-05-2025 01:33:01 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ విద్యానగర్ అరాఫత్ కాలనీలో కి అడవి నుంచి తప్పిపోయి జనా ఆవాసాల్లోకి వచ్చిన నీలి గేదెను ఆ కాలనీవాసులు కాపాడి అటవీ అధికారులకు అప్పగించారు. బుధవారం ఉదయం సమీపంలో ఉన్న అడవి నుంచి తప్పిపోయి వచ్చిన నీలి గేదెను కుక్కలు తరుముతుండగా కాలనీవాసులు కుక్కల భారీ నుంచి దానిని కాపాడారు. స్థానికులు షేక్ మాజీద్, షౌకత్ పాషాలు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా అధికారులు వచ్చి నీలి గేదెను తీసుకువెళ్లారు. ఫారెస్ట్ అధికారులు కాలనీ యువకులను అభినందించారు.