24 August, 2026 | 11:46 AM

Breaking News

అమెరికాలో దమ్మాయీగూడ యువకుడి విషాదాంతం   •   కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం   •   మంత్రి కొండా సురేఖ వివాదానికి సీఎం రేవంత్ చెక్ పెడతారా?   •   గోడ దూకిన ఇంటర్ విద్యార్థులు   •   భవనం కూలిన ఘటనలో బిల్డర్‌ సయ్యద్‌ సజీద్‌ అరెస్ట్   •   సోయం ముందస్తు వ్యూహం.. అధిష్టానం ఆదేశాలతో పల్లెబాట   •   నిశ్చితార్థం రోజే విషాదం.. కారు ప్రమాదంలో యువకుడు మృతి   •   వర్షాలు కురుస్తలేవని కుళ్ళిన శవాన్ని తీసి మళ్ళీ ఖననం.!   •   కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్   •   మొక్కును చెల్లించుకున్న దంపతులు.. శ్రీ సీతారామచంద్ర స్వామికి వెండి కానుకలు   •  

ఎల్ ఎస్ బేకరీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి

16-06-2025 11:30 PM

బాధితురాలు భర్త నరసింహ...

సూర్యాపేట (విజయక్రాంతి): ఆహార శుభ్రతకు సంబంధించి సరైన ప్రమాణాలు పాటించని జిల్లా కేంద్రంలోని ఎల్ ఎస్ బేకరీ(LS Bakery) యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని అస్వస్థతకు గురైన మహిళ భర్త వజ్రపు నరసింహ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రాల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఆదివారం సాయంత్రం తమ కూతురు జన్మదినం సందర్భంగా భార్యతో కలిసి ఎల్ఎస్ బేకరీలో కేక్ కొనుగోలు చేసినట్లు తెలిపారు.

కేక్ కట్ చేసి కేక్ తిన్న అనంతరం వాంతులు, విరోచనాలు అయ్యాయని అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి తరలించానన్నారు. తదుపరి ఈ విషయాన్ని ఎల్ ఎస్ బేకరీ నిర్వాకుల దృష్టికి తీసుకెళ్ళగా ఎలాంటి స్పందనలేదన్నారు. తన  భార్య గర్భవతి కావడంతో ప్రసవం అనంతరం పుట్టబోయే బిడ్డకు, తల్లికి గాని ఏదైనా హాని జరిగితే బేకరీ యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పట్టణంలోని బేకరీలపై పుడ్ సేప్టీ అధికారులు, మున్సిపల్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ పరిశుభ్రమైన ఆహార పదార్థాలు విక్రయించేలా చూడాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరారు.