calender_icon.png 21 September, 2025 | 9:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిక్ బాక్సింగ్ లో బంగారు పతకాలు సాధించిన కేజీబీవీ విద్యార్థులు

21-09-2025 07:49:24 PM

చింతలమానేపల్లి (విజయక్రాంతి): మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం(Kasturba Gandhi Balika Vidyalaya) నలుగురు విద్యార్థులు కిక్ బాక్సింగ్ లో గోల్డ్ మెడల్స్ సాధించారు. నేషనల్ కిక్ బాక్సింగ్ సెలక్షన్ లో భాగంగా వరంగల్ లో నిర్వహించిన ఖేలో ఇండియా అస్మిత కిక్ బాక్సింగ్ లీగ్ పోటీలలో చింతలమానేపల్లి కేజీబీవిలో చదువుతున్న విద్యార్థులు బంగారు పతకాలు సాధించి నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికైనారు. బంగారు పతకాలు సాధించిన పదవతరగతి విద్యార్థులు పోర్సెట్టి స్నేహిత, ఎల్కతూరి శ్రీజా, కడతల స్రవంతి, ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నా చౌదరి కల్యాణిలను కేజీబీవి స్పెషల్ ఆఫీసర్ శ్రీజ నందిని, పీటి మేడం పార్వతి, ఉపాధ్యలులు అభినందించారు. మా పాఠశాల నుంచి నలుగురు నేషనల్ పోటీలకు ఎంపిక కావడం సంతోషకరమైన విషయం అని, రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో పతకాలు సాధించి ఉన్నత స్థాయి వరకు ఎదగాలని కోరారు.